ఇందిరమ్మ కుటుంబ బీమా దరఖాస్తులకు ఆహ్వానం
18-11-2026 | 04:55pm
బిజినేపల్లి, నవంబర్ 17 : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తులను(Indiramma Family Life Insurance Applications) ఈ గురువారం నుండి గ్రామ స్థాయిలో స్వీకరిస్తున్నామని ఎంపిడిఓ కథలప్ప బుధవారం సాయంత్రం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం నుండి 18-59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ పథకానికి అర్హులన్నారు. కుటుంబంలో జీవనోపాధికి ప్రధాన ఆధారమైన వ్యక్తి యొక్క ఆధార్, రేషన్ కార్డులతో ఆయా గ్రామ పంచాయతీల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.