ఆరు నెలలుగా జీతాలు లేక కార్మికుల ఆవేదన

10-11-2026 | 07:55pm

కార్మికుల సమస్య అధికారులకు పట్టదా!

కొల్లాపూర్ నవంబర్ 10: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో(Government Hospital) విధులు నిర్వహిస్తున్న 46 మంది  కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు అందరం లేదని కార్మికులు(Workers) ఆరోపిస్తున్నారు. జూన్. జూలై .ఆగస్టు. సెప్టెంబర్. అక్టోబర్. నవంబర్ నెలలో కూడా జీతాలు అందడం లేదని జీతాలు(salaries) అందకుండా ఉంటే దసరా పండుగ. దీపాలు పండుగ అప్పులు తెచ్చుకొని పండుగ చేసుకునే పరిస్థితి ఏర్పడిందని కార్మికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొల్లాపూర్ ప్రభుత్వ హాస్పిటల్ లో మత శిశు హాస్పిటల్(Mata Shishu Hospital). ఏరియా హాస్పిటల్ లో కలిపి మొత్తం 46 మంది విధులు నిర్వహిస్తున్నారు. వంద పడకల హాస్పిటల్ బెడ్స్ ప్రకారం మొత్తం 46 మందికి వేతనాలు రావాల్సి ఉండగా. 50 బ్లడ్స్ ప్రకారం 21 మందికి వేతనాలు వచ్చాయి. కానీ ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు. అర్థం కావడంలేదని హాస్పిటల్ సూపర్డెంట్ యాదగిరి  అన్నారు. 

కొల్లాపూర్ సూపర్డెంట్ యాదగిరి వివరణ ఈ సమస్య గురించి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకు వెళ్ళాము. హాస్పిటల్ ఇన్చార్జి కృష్ణ మేడం దృష్టి కూడా తీసుకు వెళ్ళాము త్వరలో వారికి వేతనాలు అందజేస్తామని సూపర్డెంట్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు