వట్టెం వెంకన్నకు వైభవంగా పల్లకిసేవ

14-11-2026 | 02:50pm

బిజినేపల్లి: మండలంలోని వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం(Vattam Venkateswara Swamy Temple)లో కార్తీక మాసం(Karthika Masam) రెండో శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామివారితో పాటు భూదేవి, శ్రీదేవి అమ్మవార్ల పల్లకిసేవను శనివారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్ర ఉత్సవాలను తిలకించేందుకు, ప్రత్యేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కల్యాణం, సంతాన ప్రాప్తి, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ వచ్చిన భక్తులకు ఆలయ అర్చక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం భక్తులకు పూలు, పండ్లు, తీర్థప్రసాదాలను అందజేశారు.


మరిన్ని వార్తలు