పింఛన్‌దారులకు పత్రాల పంపిణీ
14-11-2026 | 03:51pm
వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని చౌపన్‌గూడ గ్రామ పంచాయతీ(Chaupanguda Gram Panchayat)లో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల పత్రాల(Pension documents)ను సర్పంచ్ దుర్వా జైనుబాయి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేయూత పింఛన్లు వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సిడం జుగదిరావు, ఆత్రం భీంబాయి, ఆత్రం అయ్యూ, ఆత్రం లచ్చు తదితరులు పాల్గొన్నారు.