రైతుల ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం

05-11-2026 | 07:47pm

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.

చిట్యాల, నవంబర్ 5 (విజయ క్రాంతి): రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం మద్దతు ధరకే(Government Support Price) కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham ) తెలిపారు. గురువారం చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి, అరేగూడం, పెద్దకాపర్తి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి, సర్పంచులు కాటం వెంకటేశం, అవుల సుందర్ యాదవ్, తహసిల్దార్  విజయ్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బొంతల అంజిరెడ్డి, డైరెక్టర్లు పిసాటి భీష్మారెడ్డి, గంగాపురం భాస్కర్, ఎదుళ్ల అజిత్ రెడ్డి, మురళ గోపయ్య, పీఏసీఎస్ సీఈఓ బొంతల రాజిరెడ్డి, ఏఓ గిరిబాబు, కాంగ్రెస్ నాయకులు నర్రా మోహన్ రెడ్డి, రాచమల్ల జనయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు