రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలకు విస్తృత ఏర్పాట్లు
- ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
- క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులకు సూచన
నిజామాబాద్, నవంబర్ 05 (విజయ క్రాంతి): నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్(Nizamabad Police Commissionerate) పరిధిలో ఈ నెల 25 నుంచి 28 వరకు నిర్వహించనున్న 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్(Telangana State-level Police Sports) అండ్ గేమ్స్ మీట్–2026 ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
జానకంపేట పీటీసీ, మోపాల్ ఆర్చరీ ప్రాంగణం, అలీసాగర్ బోటింగ్ ప్రాంతం, ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్తో పాటు పాల్దా, జన్నేపల్లి ప్రాంతాల్లోని క్రీడా ప్రాంగణాలను సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు వసతి, భోజనం, తాగునీరు, వైద్య, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పోటీలను విజయవంతం చేయాలని సూచించారు.
ఈ పర్యటనలో ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, శ్రీశైలం, మస్తాన్ అలీతో పాటు సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, జిల్లా యువజన క్రీడల అధికారి పవన్ కుమార్, కోచ్లు రవీందర్, రాజాగౌడ్, స్విమ్మింగ్ ఇన్చార్జి ఫారూక్ తదితరులు పాల్గొన్నారు.