ఉచిత బ్లడ్ గ్రూపింగ్ శిబిరం విజయవంతం

05-11-2026 | 07:40pm

ఆలేరు మండలం గుండ్లగూడెంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 

ఆలేరు, నవంబర్ 5 (విజయక్రాంతి): ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో మహిళా సంఘాల(self-help groups ) (SHG) ప్రోగ్రాం లో భాగంగా నిర్వహించిన ఉచిత బ్లడ్ గ్రూపింగ్ పరీక్షల శిబిరం(Free blood grouping camp) విజయవంతంగా ముగిసింది. షారాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరానికి డాక్టర్ హరీష్ పర్యవేక్షకులుగా వ్యవహరించారు.

ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఏసిరెడ్డి మంజుల మహేందర్ రెడ్డి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, మహిళలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, తమ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు గ్రామీణ మహిళలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు.

ఈ శిబిరంలో CHO సత్య, ANM లక్ష్మి, VBK శ్రీలత, ల్యాబ్ టెక్నీషియన్ సురేష్ మరియు ఆశా వర్కర్లు పాల్గొని మహిళలకు బ్లడ్ గ్రూప్ పరీక్షలు నిర్వహించారు. రక్తదానం ఆవశ్యకత, రక్తహీనత నివారణపై అవగాహన కల్పించారు. మొత్తం సుమారు 50 మంది SHG మహిళా సభ్యులకు ఉచితంగా బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు చేసి కార్డులు అందజేశారు. గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు