నల్లగొండ కార్పొరేషన్‌లో అవినీతి ఆరోపణల ప్రకంపనలు..!

06-11-2026 | 05:25am

కారుణ్య నియామకానికి నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరి?

గత ఎన్నికల నామినేషన్లు, భోజనాల పేరిట రూ.60 లక్షల దుర్వినియోగం అంటూ ప్రచారం.            

అసలు విషయాలు నిగ్గు తేల్చాలంటూ స్థానికుల వేడుకోలు

నల్లగొండ/ కట్టంగూరు నవంబర్ 5: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో(Nalgonda Municipal Corporation) చోటుచేసుకుంటున్నాయంటున్న వరుస అక్రమాల ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రజలకు సేవలు అందించాల్సిన కార్యాలయంలోనే అవినీతి ఆరోపణలు వినిపిస్తుండటంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నా యి. నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల జారీ నుంచి ప్రభుత్వ నిధుల వినియోగం వరకు పలు అంశాలపై సమగ్ర విచారణ జరగాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.

కారుణ్య నియామకానికి నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు! : కారుణ్య నియామకాలకు సంబంధించి కొందరు నకిలీ ధ్రువీకరణ పత్రాలను అందజేశారని ఆరోపణలు స్థానికంగా వినిపించాయి.అయితే ఈ నకిలీ మరణ ధ్రువీ కరణ పత్రాల జారీ వ్యవహారం వెనుక వైద్య, ఆరోగ్య, మున్సిపల్ శాఖ అధికారుల పాత్ర ఉందనే ప్రచారం స్థానికం సాగుతుంది. ఈ వ్యవహారంలో లక్షల రూపాయల ఒప్పందం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అసలు బాధ్యులను వది లి ప్రైవేటు సిబ్బందిని బాధ్యులుగా చూపిస్తున్నారనే ప్రచారాలు స్థానికంగా సాగుతు న్నట్లు సమాచారం. 

ప్రజాధనంతో వ్యక్తిగత వాహనాలకు డీజిల్..? 

ప్రభుత్వ నిధులతో వ్యక్తిగత వాహనాలకు డీజిల్ పోయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల మందలింపుల అనంతరం సుమారు రూ.20 వేల డీజిల్ బిల్లులు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఖర్చులకు సంబంధించిన బిల్లులు, రికార్డులను పరిశీలిస్తే అసలు విషయాలు తెలిసే అవకాశం ఉంది.

కమిషనర్ బదిలీ అయినా లాగిన్ కీ లావాదేవీలు..? 

బదిలీ అయిన కమిషనర్కు సంబంధించిన డిజిటల్ లాగిన్ కీ ఇంకా ఎవరి ఆధీనం లో ఉంది? ఆ లాగిన్ ద్వారా నిధుల లావాదేవీలు జరిగాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

రూ.60 లక్షల నిధులపై అనుమానాలు! 

గత ఎన్నికల నామినేషన్లు, భోజన బిల్లు ల పేరుతో సుమారు రూ.60 లక్షల నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రమోషన్ జాబితా లో ఉన్న ఓ ఉద్యోగికి సంబంధించిన కేసు విషయంలో తెరవెనుక ప్రయత్నాలు జరిగాయన్న ప్రచారాలపై విచారణ జరగాల్సి ఉంది.

సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పవా? 

జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఉద్యోగుల నుంచి ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ప్రజలకు సేవ చేయాల్సిన కార్యాలయంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అసలు నిజాలు తేల్చాలి..: 

అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యం లో వాటికి బాధ్యులెవరు? బాధితులెవరు? తెరవెనుక వ్యవహారాలు నడిపిస్తున్నదెవరు? అనే అంశాలపై ఉన్నతాధికారులు స్పందించి అసలు నిజాలు తేల్చాలని పలువురు నగర వాసులు కోరుతున్నారు. అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి సంబంధిత రికార్డులు, బిల్లులు, డిజిటల్ లాగిన్ వివరాలను పరిశీలించి ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ ప్రజాధనానికి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.


మరిన్ని వార్తలు