ఐఏఎఫ్ నూతన చీఫ్‌గా అశుతోష్
- ఈ నెల 31న బాధ్యతల స్వీకరణ
- 29వ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా దీక్షిత్ నియామకం
- ఆపరేషన్ సిందూర్(Operation Sindoor), సఫేద్ సాగర్, రక్షక్‌లో విశేష సేవలు
- ప్రయోగాత్మక టెస్ట్ పైలట్, ఫ్లయింగ్
- ఇన్‌స్ట్రక్టర్‌లో 3,500 గంటల అనుభవం
- వైమానిక రంగంలో నాలుగు దశాబ్దాల సర్వీస్
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా(Vice Chief of Air Staff) పనిచేస్తున్న ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్(Air Marshal Ashutosh Dixit) భారత వైమానిక దళం(Indian Air Force)(ఐఏఎఫ్)కు నూతన అధిపతిగా నియమితులయ్యారు. ఎయిర్ చీఫ్ మార్షల్ హెూదాలో 29వ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా అశుతోష్ దీక్షిత్‌ను ప్రభుత్వం మంగళవారం నియమించింది. అయితే ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ స్థానంలో ఆయ న ఐఏఎఫ్ నూతన చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ కాకముందు, అశుతోష్ దీక్షిత్ సెంట్రల్ ఎయిర్ కమాండ్ అయిన ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్- ఇన్- చీఫ్‌గా చేశారు.
తరువాత చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌కు చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా పనిచేశారు. ప్రస్తుతం వైస్ చీఫ్‌గా ఉన్న దీక్షిత్, ఆపరేషన్ సింధూర్, పాకిస్థాన్‌తో జరిగిన మే 2025 యుద్ధం సమయంలో ఐఏఎఫ్‌కు నాయకత్వం వహించిన సింగ్ స్థానంలో ఎయిర్ చీఫ్ మార్షల్‌గా ఉన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల సర్వీస్ ఉన్న ఫైటర్ పైలట్ అయిన దీక్షిత్, స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్ కార్యక్రమం, ఇతర భారతీయ విమాన ప్రాజెక్టులలో కీలకంగా వ్యవ హరించారు.
కమాండ్‌తోపాటు కార్యాచరణలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 1966 డిసెంబర్ 9న జన్మించిన దీక్షిత్, 1986 డిసెంబర్ 6న ఐఏఎఫ్ ఫైటర్ స్ట్రీమ్‌లోకి వచ్చారు. ప్రయోగాత్మక టెస్ట్ పైలట్, అర్హత కలిగిన ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ అయిన ఆయనకు 3,500 గంటల కు పైగా విమానం నడిపిన అనుభవం ఉంది. ఆయ న మిరాజ్-2000, మిగ్ వేరియంట్లు, కిరణ్, జాగ్వార్, ఐఎల్-78, హాక్, తేజస్ వంటి విమానాలను నడిపారు. ఆయన ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ సిందూర్‌లో బహుముఖ ప్రజ్ఞ కనబరిచారు.
దీక్షిత్ ఒక మిరాజ్-2000 స్క్వాడ్రన్‌కు, పశ్చిమ సెక్టార్‌లోని ఒక ఫ్రంట్‌లైన్ ఫైటర్ ఎయిర్ బేస్‌కు, దక్షిణ సెక్టార్‌లోని ఒక ఫైటర్ శిక్షణా స్థావరానికి కమాండర్‌గా వ్యవహరించారు. వైస్ చీఫ్ కాకముందు, ఆయన సెంట్రల్ ఎయిర్ కమాండ్‌కు అధిపతిగా పనిచేశారు, తరువాత చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌కు చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా సేవలందించారు. అలాగే దీక్షిత్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా కూడా పనిచేశారు. ఈ పదవి ప్రణాళిక, విధానం, కార్యాచరణ సామర్థ్యాలపై దృష్టి సారిస్తుంది.
ఎయిర్ హెడ్ క్వార్టర్స్‌లో, ఆయన ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ రిక్వైర్మింట్స్, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ప్రాజెక్ట్స్), అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ప్లాన్స్) పదవులను నిర్వహించారు. ఆయన గతంలో సదరన్ ఎయిర్ కమాండ్ ఎయిర్ డిఫెన్స్ కమాండర్, సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ పదవులను కూడా నిర్వహించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన దీక్షిత్, బంగ్లాదేశ్‌లో స్టాఫ్ కోర్సు పూర్తి చేసి, న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యాడు. అతనికి 2006లో వాయు సేన పతకం, 2011లో విశిష్ట సేవా పతకం, 2023లో అతి విశిష్ట సేవా పతకం, 2026లో పరమ విశిష్ట సేవా పతకం లభించాయి.