బై పోల్‌లో బీజేపీ, టీవీకే హవా

10-10-2026 | 05:20am
  1. బీజేపీ ఖాతాలో పశ్చిమ బంగాల్ రెండు అసెంబ్లీ, అసోం ఒక లోక్‌సభ స్థానం
  2. తమిళనాడు రెండు అసెంబ్లీ స్థానాల్లో టీవీకే పాగా
  3. పుదుచ్చేరి అసెంబ్లీలో ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయం

కోల్‌కతా/చెన్నై/గోవా/పుదుచ్చేరి, అక్టోబర్ 9 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఐదు అసెంబ్లీ(Assembly), ఒక లోక్(Lok Sabha) సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, టీవీకే గాలి వీచింది. రెండు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాల్లో బీజేపీ విజయఢంకా మ్రోగించగా, బీజేపీ అనుబంధ పార్టీ ఒక స్థానంలో, రెండు స్థానాల్లో టీవీకే పార్టీ విజయం సాధించాయి. అక్టోబర్ 6న పశ్చిమ బంగాల్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులో రెండు అసెంబ్లీ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక అసెంబ్లీ స్థానం, అసోంలోని ఒక లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగ్గా, శుక్రవారం ఫలితాలు విడుదలయ్యాయి.

పశ్చిమ బంగాల్‌లోని నందిగ్రామ్‌లో సీఎం సువేందు రికార్డును బద్దలు కొడుతూ బీజేపీ అభ్యర్థి హసిరానీ రథ్ 1.22 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. ఈ మెకు 1,64,427 ఓట్లు దక్కాయి. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు 41,674 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఇదే రాష్ట్రంలోని మరో స్థానం రెజీనగర్‌లోనూ బీజేపీ అభ్యర్థి శంక్‌రావ్ సర్కార్ 1,29,914 ఓట్లు దక్కగా, ప్రత్యర్థి ఏజీయూపీ (ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ) అభ్యర్థి గూలాం నబీకి 54,098 ఓట్లతో ఓటమి పాలయ్యారు.

75,816 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ముస్లింలు 70 శాతంగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి భారీ ఓట్ల తేడాతో విజయం సాధించడం పట్ల వి శ్లేషకుల అంచనాలు పూర్తిగా తలకిందులైనట్లయ్యింది. అసోంలోని నౌగావ్ లోక్‌సభ ఉ ప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దేవాశిష్ శర్మకు 6,87,110 ఓట్లతో విజయం సాధించగా, ఏ ఐయూడీఎఫ్ (ఆల్ ఇండియా యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్) అభ్యర్థి బద్రుద్దీన్ అజ్మల్‌కు 5,20,976 ఓట్లతో ఓటమిపాలయ్యారు.

తమిళనాడు ధారాపురం అసెంబ్లీ స్థానం నుంచి టీవీకే అభ్యర్థి సత్యబామ 66,841 ఓట్లతో విజయం సాధిచగా, ఏఐడీఎంకే అ భ్యర్థి సుగున్య 57,370 ఓట్లు దక్కించుకొని ఓటమి పాలయ్యారు. ఏఐడీఎంకేలో ఉండగా ఇదే స్థానం నుంచి గెలుపొందిన సత్యభామ టీవీకేలో చేరడంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి.

మధురాంతకం అసెంబ్లీ స్థానం నుంచి టీవీకే అభ్యర్థి కె. కుమార్‌వేల్ 74,048 ఓట్లతో విజయం సాధించగా, డీఎంకే అభ్యర్థి 54,008 ఓట్లతో ఓటమి పాలయ్యారు. పుదుచ్చేరి నుంచి ఎన్డీయే మద్దతు ఏఐఎన్‌ఆర్‌సీ (ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్) అభ్యర్థి అశోక్ ఆనంద్ 13,358 ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి ఇ. వినియాగమ్ 4,876 ఓట్లు దక్కించుకొని ఓటమి పాలయ్యారు. 

మరిన్ని వార్తలు