బీజేపీ వ్యతిరేకులే ‘సర్’ టార్గెట్
- ప్రజల ఓటు హక్కును హరించిన సీఈసీ జ్ఞానేష్
- ప్రజాస్వామ్యాన్ని ‘పలుచన’ చేస్తున్న ఆ ముగ్గరు
- సీజేపీ నేత అభిజీత్ దీప్కే
- బెంగళూరులో సీజేపీ ‘ప్రజాకోర్టు’, ‘చెప్పుల నిరసన’
- హాజరైన నటుడు ప్రకాష్‌రాజ్, యూట్యూబర్ ధ్రువ్ రాతీ
బెంగళూరు, అక్టోబర్ 8: బీజేపీని వ్యతిరేకించే వారే సర్ టార్గెట్ అని, వారి ఓటు హక్కును హరించడానికే ఎస్‌ఐఆర్ కింద ఓటర్ల తొలగింపు జరుగుతోందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే(CJP founder Abhijit Dipke) ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈసీ ప్రజాస్వా మ్యాన్ని ‘పలుచన’ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
మన ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడుకోవడానికి మనం పోరాడాలని స్పష్టం చేశారు. సర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో సర్ ఓట్ల తొలగింపు సమస్య మాత్రమే కాదని, పౌరుల హక్కులు, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. బెంగళూరులో ఓట్లు కోల్పోయిన బాధితులంతా కలిసి స్థానిక ఫ్రీడమ్ పార్క్‌లో గురవారం ప్రజాకోర్టు (పీపుల్స్ ట్రిబ్యునల్’ను నిర్వహించా యి.
ఈ కార్యక్రమంతో పాటు మహిళలకు మద్దతుగా సీజేపీ ‘చెప్పుల నిరసన’ చేపట్టింది. మహిళలపై జరుగుతున్న నేరాలను ఖండించింది. ఈ ప్రజాకోర్టు కార్యక్రమంలో సీజేపీ నేత అభిజీత్ దీప్కేతోపాటు ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్, ప్రముఖ యూట్యూబర్, రాజకీయ వ్యాఖ్యా త ధ్రువ్ రాతీ (రాఠీ) కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీప్కే మాట్లాడుతూ, తమ పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డాయని ఆరో పణలు ఎదుర్కొంటున్న ప్రజలు తాము బతికే ఉన్నామని ప్రదర్శించడానికి ఈ కార్యక్రమానికి హాజరయ్యారని అన్నారు.
చనిపోయా రని సర్ ప్రకటించిన ప్రజలు ఇక్కడ సజీవంగా నిలబడి ఉన్నారు. కాబట్టి జరిగిన మరణం ఈ ప్రజలది కాదని, ఇది ఈ దేశ ప్రజాస్వామ్యా నికి మరణశాసనం’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ఆదేశాల మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో సహా ఎన్నికల సంఘం అధికారులు ప్రజల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం సమ్మిళిత భారతదే శాన్ని గానీ, బీఆర్. అంబేద్కర్ లేదా పెరియార్‌ల సిద్ధాంతాలను గానీ విశ్వసించదని, దానికి బదులుగా నాథూరాం గాడ్సేను ఆదర్శంగా తీసుకుంటుందని ఆయన విమర్శించారు.
‘మన ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడుకోవడానికి మనం ఆ భావజాలానికి వ్యతిరే కంగా పోరాడాలి’ అని పిలుపు ఇచ్చారు. మోదీ తనను మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూతో పోల్చుకో లేరని స్పష్టం చేశా రు. ఓట్లను తొలగించడం ద్వారా నెహ్రూ కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండాలని మోదీ కోరుకుంటున్నా రని ఆరోపించారు. ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. సర్ ఓట్ల తొలగింపు సమస్య మాత్రమే కాదని, పౌరుల హక్కులు, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని అభివర్ణించారు.
ఈ నిరసనలకు మద్దతుగా యూట్యూబర్ ధ్రువ్‌రాతీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి నేరుగా బహిరంగ నిరసనలో పాల్గొనడం ఇదే మొదటిసారి. అయితే మహిళలపై జరుగుతున్న నేరాలను ఖండిస్తూ, వారికి భద్రత, తగిన చర్యలు కల్పించాలని డిమాం డ్ చేస్తూ సీజేపీ సభ్యులు బెంగళూరులో ‘చెప్పుల నిరసన’ చేపట్టారు. సీజేపీ నేత అభి జీత్ దిప్కే, సహ-కన్వీనర్ అశుతోష్ రంకా, ప్రతినిధి సౌరవ్‌దాస్ ఈ నిరసనలో పాల్గొని మహిళలకు సంఘీభావం తెలిపారు.