మూసీ ప్రక్షాళనపై తగ్గేది లేదు
- ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే సహించేదే లేదు
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
- శిల్పారామం వద్ద తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన సీఎం
- సినీ హీరో నాగార్జున ఔదార్యానికి ప్రశంసలు
రంగారెడ్డి బ్యూరో/శేరిలింగంపల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): మూసీ పునరుజ్జీవనాన్ని(Musi Rejuvenation) ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే సహించేదే లేదని హెచ్చరించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(Hyderabad Outer Ring Road) పరిధిలోని 1.30 కోట్ల మంది, నల్లగొండ జిల్లాలోని(Nalgonda District) 35 లక్షల మంది భవిష్యత్తు, ఆరోగ్య పరిరక్ష ణను దృష్టిలో పెట్టుకుని మూసీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు.
హైదరాబాద్ శిల్పారామం సమీ పంలో రూ.20 కోట్లతో హైడ్రా(HYDRA) ఆధ్వర్యంలో పునరుద్ధరించిన మాదాపూర్ తమ్మిడికుంట చెరువు(Tammidikunta Lake) ను మంగళవారం సినీ హీరో అక్కినేని నాగార్జునతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించి నగరవా సులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దశాబ్దాల నిర్లక్ష్యం, ఆక్రమణల కారణంగా మూసీ అనగానే దుర్గంధం, మురికికూపం, కళేబరాలే గుర్తుకొస్తున్నాయని, ఈ పరిస్థితిని మార్చి నదికి పునరుజ్జీవం పోయడమే లక్ష్యమన్నారు.
తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణకు హైడ్రా కృషిని సీఎం కొనియాడారు. ఆక్రమణల నుంచి విముక్తి కల్పించడం వల్ల చెరువు విస్తీర్ణం 14 ఎకరాల నుంచి 30.5 ఎకరాలకు పెరిగిందని సీఎం తెలిపారు. గతంలో 46 మిలియన్ లీటర్లున్నన్న నీటి నిల్వ సామర్థ్యం 375 మిలియన్ లీటర్లకు చే రిందన్నారు.
‘వర్క్ ఫ్రమ్ తమ్మిడికుంట’
ఐటీ ఉద్యోగులు ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు నిర్వహించుకునేలా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ తరహాలో ‘వర్క్ ఫ్రమ్ తమ్మిడికుంట’ విధానాన్ని అందుబాటులోకి తేవాలని అధికారులకు సీఎం సూచించారు. ఇందుకు వైఫై సౌకర్యం కల్పించాలన్నారు. అలైబలై, కైట్ ఫెస్టివల్ వంటి వేడుకలను ఇక్కడ నిర్వహించాలని, నిరుపేద మహిళల ఉత్పత్తుల విక్రయానికి ఇందిరా మహి ళా శక్తి స్టాళ్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు ‘సిటీ ఆఫ్ లేక్స్’గా తిరిగి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.
నిజ జీవితంలోనూ నాగార్జున హీరోనే
తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణకు సినీ నటుడు అక్కినేని నాగార్జున రెండు ఎకరాల స్థలా న్ని కేటాయించడాన్ని సీఎం అభినందించారు. నిజ జీవితంలోనూ నాగార్జున హీరో అని ప్రశంసించారు. తమ్మిడికుంట వద్ద డ్యాన్స్ చేయలేనే మో కానీ, తప్పకుండా సినిమా షూటింగ్ చేస్తానని చె ప్పారు. తమ్మిడికుంట సుందరీకరణలో భాగంగా గుడిసెలు కోల్పోయిన కుటుంబాలకు సీఎం ఇం దిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు.
64 చెరువుల అభివృద్ధికి సహకరించాలి
తమ్మిడికుంట పునరుద్ధరణతో పరిసర ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన వాతావరణం అందుబాటులోకి వచ్చిందని పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. సీఎం, హైడ్రా కమిషనర్ రంగనాథ్, అధికారుల సమన్వయంతోనే చెరువు అభి వృద్ధి సాధ్యమైందని, నియోజకవర్గ ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నియోజక వర్గంలోని 64 చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు సహకారం అందించాలని సీఎంను కోరారు.
కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌యాదవ్, ఎంపీలువిశ్వేశ్వర్‌రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, నవీన్‌యాదవ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, కలెక్టర్ నారా యణరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్, సీఎంసీ కమిషనర్ సృజన, చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.