కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ‘ఇజ్రాయెల్ శౌర్యం’

10-10-2026 | 05:20am
  1. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోగా నిలిచినందుకు పురస్కారం
  2. మచ్చర్ కోలుకున్న తర్వాత అందజేత
  3. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్

టెల్‌అవీవ్, అక్టోబర్ 9: ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో తన కో-పైలట్ దాడిని తిప్పికొట్టిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్(Indian captain Smith Matcher), పౌరులకు ఇచ్చే ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారాన్ని అందుకోనున్నారని అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తెలిపారు. గత నెల 30, 2026న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ కు ప్రయాణిస్తున్న విమానంలోని ఆరుగురు వ్యక్తులకు అధ్యక్షుడు హెర్జాగ్ గురువారం పౌర వీరత్వానికి రాష్ట్రపతి పురస్కారాన్ని ప్రదానం చేశారు.

జెరూసలేంలోని రాష్ట్రపతి నివాసంలో జరిగిన కార్యక్రమంలో హెర్జోగ్ మాట్లాడుతూ, ‘ఈ రోజు మనం సత్కరిస్తున్న ఇజ్రాయెల్ వీరులతో పాటు, భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని అన్నారు. మచ్చర్ ‘అపారమైన ధైర్యసాహసాలు, పటిష్టమైన వృత్తి నైపుణ్యం ఈ విపత్తును నివారించడంలో సహాయపడ్డాయి. అతను కోలుకున్న తర్వాత, ఇజ్రాయెల్ ప్రజల తరఫున, స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ తన ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ను అతనికి ప్రదానం చేయడం నాకు దక్కిన గౌరవం, అ దృష్టం’ అని ఆయన అన్నారు.

ఈ అవా ర్డు అనేది ఇజ్రాయెల్ అత్యున్నత పౌర వీరత్వ పురస్కారం. అధ్యక్ష కార్యాలయం ప్రకారం.. మూడు రోజుల క్రితమే అధ్యక్షుడు హెర్జోగ్ చేత ఈ పురస్కారాన్ని స్థాపించారు. మానవ ప్రాణాలను కాపాడటానికి, పరస్పర బాధ్యతతో, తమ ప్రాణాలకు నిజమైన ప్రమాదం ఉన్నప్పటికీ అసాధారణ వీరత్వంతో వ్యవహరించిన వ్యక్తులను ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ అవార్డును అందజేసి గౌరవించనున్నట్లు తెలియజేస్తుంది.

మరిన్ని వార్తలు