గిరిజన ప్రాంతాల్లో మోదీ భారీ యాక్షన్

15-11-2026 | 12:32pm

గిరిజనుల అభివృద్ధికి మోదీ భారీ గిఫ్ట్.. రూ.3 వేల కోట్లతో 246 ప్రాజెక్టులు ప్రారంభం!

గడ్చిరోలి: గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా నిర్వహించిన జనజాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులతో ఆయన Virtual Interaction నిర్వహించారు. మొత్తం రూ.3 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 246 Development Projectsను ప్రారంభించడంతో పాటు మరికొన్ని పనులకు Foundation Stone వేశారు.

ఈ ప్రాజెక్టులు గిరిజన ప్రాంతాల్లో Education, Healthcare, Employment Opportunities, Community Infrastructureను బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల తమ జీవితాల్లో వచ్చిన మార్పులను పలువురు లబ్ధిదారులు ప్రధాని మోదీతో పంచుకున్నారు. మహారాష్ట్రలోని యవత్మాల్‌కు చెందిన PM-JANMAN లబ్ధిదారుడు కృష్ణ నాగోరావు టేకా మాట్లాడుతూ.. గతంలో వర్షాకాలంలో ఇళ్లలో ఉండటమే కష్టంగా ఉండేదని, కీటకాల సమస్యలు కూడా ఎదురయ్యేవని తెలిపారు. ఇప్పుడు పక్కా ఇల్లు, మరుగుదొడ్డి, ఇతర సదుపాయాలు అందడంతో ఇబ్బందులు తొలగిపోయాయని చెప్పారు. దీనిపై స్పందించిన మోదీ.. పథకాల ద్వారా గిరిజన గ్రామాల్లో వస్తున్న మార్పులు తనకు ఎంతో సంతృప్తినిస్తున్నాయని అన్నారు.

గుజరాత్‌లోని భరూచ్ జిల్లాకు చెందిన వజీర్‌తో మాట్లాడిన ప్రధాని.. గిరిజనుల జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి గురించి తెలుసుకున్నారు. 2004లో New Gujarat Pattern Yojana ద్వారా వెదురు వస్తువుల తయారీలో Training పొందినట్లు వజీర్ వివరించారు. ఈ సందర్భంగా మోదీ గత ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. బ్రిటిష్ పాలకులు వెదురును చెట్టుగా పరిగణిస్తూ దానిని నరికిన వారిని శిక్షించేలా చట్టం తీసుకొచ్చారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే ఆ చట్టాన్ని రద్దు చేయాల్సి ఉండగా, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం ఆ నిబంధనను తొలగించి గిరిజనులకు వెదురుపై పూర్తి హక్కులు కల్పించిందని పేర్కొన్నారు.

ఇక మొత్తం 246 ప్రాజెక్టుల్లో 173 కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. వీటిలో గిరిజన విద్యార్థుల కోసం 38 Eklavya Model Residential Schools, PM-JANMAN కింద 100 Multi-Purpose Centres ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో Tribal Research Institute భవనం, మిజోరంలోని ఐజ్వాల్‌లో Ropuiliani Tribal Freedom Fighter Museum కూడా ప్రారంభించారు. మరో 19 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గిరిజన ఉత్పత్తిదారులకు Market Access పెంచేందుకు 12 Tribal Multi-purpose Marketing Centresతో పాటు PM-JANMAN, DAJGUA కింద మరో 42 ప్రాజెక్టులకు పునాది వేశారు. నవంబర్ 1 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన Janjatiya Gaurav Pakhwada కార్యక్రమాలకు ఈ వేడుక ముగింపుగా నిలిచింది.

మరిన్ని వార్తలు