భారత యుద్ధనౌకను ఢీకొన్న పాక్ నౌక
- పాక్ దౌత్యాధికారికి, ఎంఈఏకు భారత్ సమన్లు
- ఇది విరుద్ధమైన ప్రవర్తన, నిబంధనల ఉల్లంఘనే..
- తీవ్ర నిరసన తెలిపిన భారత ఎంఈఏ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: అరేబియా సముద్రం(Arabian Sea)లో భారత నౌకాదళ యుద్ధనౌక(Indian Navy warship)ను పాకిస్థాన్ నౌకాదళా(Pakistan Navy)నికి చెందిన నౌక ఢీకొన్న ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డీ అఫైర్స్(సీడీఏ) సాద్ వరిచ్ను, పాకిస్థాన్ ఛార్జ్ డి అఫైర్స్ (సీడీఏ)కు, పాక్ విదేశాంగ శాఖకు బుధవారం భారత్ సమన్లు జారీ(India issues summons) చేసింది. పాకిస్తాన్ నౌకాదళ యూనిట్ ‘ఆమోదయోగ్యం కాని, వృత్తికి విరుద్ధంగా ప్రవర్తించి, నిబంధనలను ఉల్లగించిందని’ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(Ministry of External Affairs, India) (ఎంఈఏ) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి, అన్ని సైనిక విభాగాలు(Military units) తగిన జాగ్రత్తలు పాటించాలని సంబంధిత పాకిస్తానీ అధికారులకు తెలియజేయాలని పాకిస్తానీ దౌత్యవేత్తకు హెచ్చరించింది. ఈ నెల 15న సాయంత్రం ఉత్తర అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన ఒక యుద్ధనౌక దాన్ని నిఘా విధుల్లో ఉంది. అయితే పాకిస్తాన్ నౌకాదళానికి చెందిన ‘హునైన్’(Hunayn) అనే ఆఫ్‌షోర్ పెట్రోల్ నౌక అత్యంత వేగంతో, నిర్లక్ష్యంగా, ఉద్దేశపూర్వకగా దూసుకొచ్చి భారత నౌకను ఢీకొట్టిందని అధికారికవర్గాలు తెలిపాయి.
ఈ ఘటనలో ‘హునైన్’ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ ఘటనలో పెద్దగా నష్టం జరగలేదని భారత ఎంఈఏ వెల్లడించింది. అయితే పాకిస్తాన్ నౌక ప్రవర్తన.. 1991 ఏప్రిల్‌లో భారత్- మధ్య కుదిరిన సైనికులు, కసరత్తులు, విమాన కదలికలపై ముందస్తు నోటీసులకు సంబంధించిన ఒప్పందంలో ఆర్టికల్ 10కి విరుద్ధంగా ఉంది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని సైనిక విభాగాలకు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఇరుదేశాల మధ్య అమల్లో ఉన్న ఒప్పందాల నిబంధనలను గౌరవించాలని పాకిస్థాన్ అధికారులకు తెలియజేయాలని సాద్ వరిచ్కు సూచించినట్లు ఎంఈఏ తెలిపింది. అదేవిధంగా, ఇస్లామాబాద్‌లోని భారత ఛార్జ్ డి అఫైర్స్‌ను కూడా పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఇదే తరహా నిరసన తెలియజేయాలని సూచించింది. ఘటనపై దౌత్య మార్గాల్లో భారత్ తన అభ్యంతరాన్ని స్పష్టంగా వ్యక్తం చేసింది.