పినరయిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయండి

10-10-2026 | 05:10am
  1. కుమార్తె వీణా, భర్త రియాస్‌లపై కూడా
  2. విజిలెన్స్, ఏసీబీకి కేరళ హైకోర్టు ఆదేశాలు
  3. త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలి
  4. సీఎంఆర్‌ఎల్ కేసులో ఈడీ పిటిషన్ విచారణ

తిరువనంతపురం, అక్టోబర్ 9: సీఎంఆర్‌ఎల్- ఎక్సాలాజిక్ కేసులో (CMRL-Exalogic Case)పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణా, ఆమె భర్త మహమ్మద్ రియాస్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కేరళ హైకోర్టు(Kerala High Court) ఆదేశించింది. ఈడీ సమర్పించిన పిటిషన్‌ను శుక్రవారం కేరళ హైకోర్టు విచారించి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఎ. బద్రుద్దీన్  పీఎంఎల్‌ఎలోని సెక్షన్ 66 (2) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, విజిలెన్స్, ఏసీబీ డైరెక్టర్‌ను ఆదేశాలు జారీ చేశారు.

ఈడీ సమర్పించిన వాంగ్మూలాలు, సాక్ష్యాలు, ఆర్థిక రికార్డులను కోర్టు పరిశీలించింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు వెంటనే పూర్తి చేసి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఐటీ కన్సల్టెన్సీ సేవలు అందించే నెపంతో కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె  వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అనే సంస్థకి సీఎంఆర్‌ఎల్ మొత్తం రూ. 2.78 కోట్ల మోసపూరిత చెల్లింపులు చేసిందని ఈడీ కోర్టుకు సమర్పించిన నివేదికలో ఆరోపించింది.

కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) మైనింగ్ కంపెనీకి సంబంధించిన లంచం కేసులో కూడా వీరిద్దరితోపాటు వీణా భర్తపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఈడీ కోరింది. జూన్‌లో వీణా విజయన్ నివాసంపై ఈడీ సోదాలు నిర్వహించి పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంది.

మరిన్ని వార్తలు