‘యూపీఐ పన్ను’ను వెనక్కి తీసుకోండి

17-09-2026 | 05:35am
  1. మోదీజీ ట్రంప్ వద్ద మోకరిల్ల వద్దు
  2. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
  3. ఇది నరేంద్ర మోదీ ట్రంప్ బుజ్జగింపు చర్య
  4. నోటాను పునర్నిర్వచించిన కాంగ్రెస్ పార్టీ
  5. ఎండీఆర్ విధింపును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిల్
  6. ఏ విదేశీ ప్రభావం లేదన్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 16: రూ.2,000 కంటే ఎక్కువ విలువైన మర్చంట్ లావాదేవీలపై 0.4% మర్చంట్ డిస్కౌంట్ రేట్(Merchant Discount Rate) (ఎండీఆర్) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం(Central Government) తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతు న్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దీనిని ‘యూపీఐ పన్ను‘గా అభివర్ణిస్తూ, ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ముందు మోకరిల్లుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకు న్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు.

అమెరికా కార్డుల కంపెనీల లబ్ధికోసమే యూపీఐని బలిచేస్తున్నారని విమర్శించారు. ఈ ఎమ్డీఆర్ విధానంపై ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై దాడిని తీవ్రతరం చేశాయి. ఈ కొత్త ఛార్జీల విధానాన్ని ప్రతిపక్షాలు ‘మోదీ టాక్స్’ లేదా ‘డిజిటల్ పేమెంట్స్ టాక్స్’ అని పిలుస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశౠయి. ఉచిత యూపీఐ విధానం వల్ల వీసా, మాస్టర్ కార్డ్ వంటి అమెరికన్ కార్డ్ కంపెనీలు నష్టపోతున్నాయని, వారి పోటీని తట్టుకునేందుకే భారత్ ఈ ఛార్జీలను ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఆరోపించారు.

దీనిని-- నరేంద్ర మోదీ కొనసాగిస్తున్న ట్రంప్ బుజ్జగింపు’(నోటా:నరేంద్ర ఆన్‌గోయింగ్ ట్రంప్ అప్పీస్‌మెంట్)) చర్య అని ఎద్దేవా చేశారు. అయితే ఈ విధానం వెనుక ఏ విదేశీ ప్రభావం లేదని, ఎవ్వరికీ తలొగ్గలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మరోపక్క ఎండీఆర్ విధింపును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. తగిన చట్టపరమైన రక్షణలు, పారదర్శకత లేదా ప్రజల సంప్రదిం పులు లేకుండానే ఈ రుసుమును ప్రవేశపెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఎండీఆర్ విధానంపై రాహుల్ గాంధీ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘మోదీ జీ, యూపీఐ పన్నును తక్షణమే వెనక్కి తీసుకోండి’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. యూపీఐతో పోటీ పడటానికి అమెరికా కార్డ్ కంపెనీలకు వీలు కల్పించేందుకే ఎండీఆర్‌ను ప్రకటించారా అని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘నోటాకు కొత్త నిర్వచనం ఇచ్చారు -ఆయన. ‘నరేంద్ర కొనసాగిస్తున్న ట్రంప్ బుజ్జగింపు’ అని విమర్శించారు. సామాన్యులపై భారం పడే అవకాశం ఉందని కాంగ్రెస్, టీఎంసీ, సీపీఐ ఆర్జేడీ ఆరోపించాయి.

ఏ విదేశీ ప్రభావం కూడా లేదు : కేంద్రం 

రూ. 2,000 పైబడిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్)ను విధించాలన్న నిర్ణయం వెనుక ఎలాంటి విదేశీ ప్రభావమూ లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎండీఆర్ విధించాలన్న నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి లొంగిపోయిందని కాంగ్రెస్తో సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ స్పష్టత ఇచ్చింది. ప్రతిపక్షాలు చేస్తున్న ది అవాస్తవం అని తెలిపింది. స్వయం సమృద్ధిగల, సమ్మిళితమైన, అందుబాటు ధరలలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను నిర్మించాలనే స్పష్టమైన లక్ష్యంతో, భారతదేశపు యూపీఐ విధాన నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోబడతాయి’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పేర్కొంది. 

యూపీఐ లావాదేవీలపై సుప్రీంలో పిల్ 

యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చార్జీల నిర్ణయం కాస్త సుప్రీంకోర్టుకు చేరింది. కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, దీనికి వ్యతిరేకంగా బుధవారం న్యాయవాది అంజన్ దత్తా సుప్రీంలో పిల్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) దాఖలు చేశారు. లావాదేవీలపై కేంద్ర ఆర్థికశాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లను రద్దు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులపైనే చివరికి ప్రభావం చూపుతుం దని ఆరోపించారు. కేంద్రం, ఆర్బీఐ, ఎన్‌పీసీఐలు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అందుకే ఈ నిర్ణయాన్ని రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు