ప్రజావాణిలో 114 దరఖాస్తులు
కామారెడ్డి అర్బన్, మార్చి 16 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని 25వ నంబర్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ మధుమోహన్ పాల్గొని దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన దరఖాస్తుదారుల నుండి వచ్చిన వినతిపత్రాలను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు.
ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. శాఖల వారీగా దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన దరఖాస్తులు 114 వచ్చాయని , అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో సీఈఓ చందర్, Ao, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.




