29 June, 2026 | 8:01 AM

చికెన్ ధరలు తగ్గాలి

23-05-2024 12:09 AM

భగ్గుమంటున్న  ఎండలతో నోరూరించే చికెన్ ధరలు కొండెక్కాయి రోజూ రూ.10 చొప్పున పెరుగుతూ జేబులు గుల్ల చేస్తూ వున్నాయి. దాంతో ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.300వరకు  పలుకుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చికెన్ ధర రూ. 280 దాటడంతో మాంసం ప్రియులు దానికి దూరమవుతున్నారు. కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఒక గుడ్డును రూ. 6కు అమ్ముతున్నారు. చికెన్, గుడ్ల ధరలు పెరగడంతో సామాన్యు లు ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన ధరలు తగ్గేలా చూడాలి.

 - కామిడి సతీశ్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి