7 May, 2026 | 1:06 PM

యువతకు స్ఫూర్తిదాయకం

23-05-2024 12:12 AM

అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ పర్యాటకుడిగా మన తెలుగు వాడు గోపీచంద్ తోటకూర రోదసి ప్రయాణం విజయవంతం కావడం యావత్ యువతకు గర్వకారణం, స్ఫూర్తిదా యకం. మన దేశపు భవిష్యత్ అభివృద్ధి మనం చేసే స్పేస్ ప్రయోగాలపై ఆధారపడి వుందన్నది నిజం. ఇస్రో, డిఆర్‌డిఓ, బార్క్ వంటి మన దేశ సంస్థలు, మన ఇంజినీర్లు, శాస్త్రజ్ఞులు ఆ దిశగా చాలా శ్రమిస్తున్నారు. భవిష్యత్‌లో మనంచేసే ప్రయోగాలకు పరికరాలన్నీ మనమే తయారు చేసేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. మన దేశపు పౌరసత్వం మాత్రమే కల్గిన మన విఖ్యాత శాస్త్రవేత్తలకు సరైన ప్రోత్సాహం ఇవ్వాలి. శాస్త్రవేతల స్ఫూర్తితో మనం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచదేశాలను శాసించే స్థాయిలో వుంటేనే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందగలం.

- ఫిజిక్స్ అరుణ్ కుమార్, నాగర్ కర్నూల్