21 March, 2026 | 5:19 AM

పశుసంవర్థక, మత్స్యశాఖకు రూ.1,529 కోట్లు

21-03-2026 02:00 AM

గత బడ్జెట్ కంటే రూ.145 కోట్లు తక్కువ

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): పశు సంవర్థక, మత్స్యశాఖకు గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్‌లో నిధులు తక్కువగా కేటాయించింది. ఈసారి రూ.1,529 కోట్లు కేటాయించగా, గత బడ్జెట్‌లో రూ.1,674 కోట్లు కేటాయించింది. ఈసారి రూ.145 కోట్లు తక్కువగా కేటాయించింది. ఏటా ప్రతిశాఖకు బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్న ప్రభుత్వం పశుసంవర్థక శాఖకు మంత్రి తగ్గించడం గమనార్హం. తెలంగాణలో గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మూడవ స్థానంలో ఉండగా, 11.58 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తితో దేశంలో 5వ స్థానానికి చేరుకున్నది. కోహెడలో రూ.47 కోట్లతో హోల్‌సెల్ చేపల మార్కెట్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.