calender_icon.png 4 December, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప ఆలయ నిర్వాహణకు ప్రతినెల రూ.20వేలు వితరణ

04-12-2025 01:45:52 AM

మహబూబాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఏకశిల పదునెట్టంబడితో ప్రత్యేకతను చాటుకుంటున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం శ్రీ ధర్మశాస్త అయ్యప్ప దేవాలయ నిర్వహణకు ప్రతినెల 20వేల రూపాయలను ఇవ్వడానికి నూతనంగా ఏర్పడ్డ శ్రీ ధర్మశాస్త సేవా ట్రస్ట్ నిర్ణయించింది. 40 మంది సభ్యులతో ఏర్పడ్డ ట్రస్ట్ ప్రతినెల దేవాలయ నిర్వహణ కోసం 20 వేల రూపాయలను శాశ్వతంగా ఇవ్వాలని తీర్మానించారు.

ఈ మేరకు బుధవారం ట్రస్ట్ సభ్యులు అయ్యప్ప ఆలయ ప్రధాన తాంత్రి విష్ణు నారాయణ పొట్టి చేతుల మీదుగా నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు కీర్తి సుధాకర్, పెరుమాండ్ల ఎల్లగౌడ్, కూరెల్లి సతీష్, కొత్తపల్లి వీరస్వామి, నరేటి కొమురయ్య, బానోత్ (డోజర్) వెంకన్న, కక్కర్ల ఐలయ్య, బాదావత్ వెంకన్న, చాపల మధు, గడ్డం వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఈరోజు నూతనంగా ఏర్పడిన కేసముద్రం శ్రీధర్మశాస్త్ర సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దేవాలయ ఖర్చులకు శాశ్వతంగా నెలకు20.000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కేసముద్రం ప్రధాన తాంత్రి వర్యులు శ్రీ విష్ణు నారాయణ పొట్టి గారి ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ బాధ్యులైనటువంటిPST సభ్యులకు20.000 రూపాయలు ట్రస్టు సభ్యులు ఇవ్వడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో కీర్తి సుధాకర్,పెరుమాళ్ళ ఎల్లగౌడ్, కూరెల్లి సతీష్,కొత్తపల్లి వీరస్వామి,నేరేటి కొమురయ్య, బానోత్ వెంకన్న (డోజర్), కక్కెర్ల ఐలయ్య,బాదావత్ వెంకన్న,చాపల మధు,గడ్డం వెంకట్,గురుస్వాములు స్వాములు పాల్గొనడం జరిగింది