నిరుపేద చిన్నారి ప్రాణాల కోసం పోరాటం – దాతల సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బుట్టి శ్రీకాంత్ – పవిత్ర దంపతులకు పుట్టిన మూడు రోజుల పసి చిన్నారి ప్రస్తుతం తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ లోకాన్ని సరిగ్గా చూడకముందే ఆ అమాయక శిశువు ఇంతటి ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటుండటం గ్రామస్తులను కలచివేస్తోంది.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, చిన్నారి ప్రాణాలను కాపాడాలంటే అత్యవసరంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ శస్త్రచికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతుండటంతో, నిరుపేద కుటుంబానికి అది భారంగా మారింది. దీంతో ఆ తల్లిదండ్రులు దాతల సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
గ్రామస్తులు, దాతలు ముందుకు వచ్చి తమకు చేతనైనంత సహాయం అందించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. మీ చిన్న సహాయం కూడా ఒక అమూల్యమైన ప్రాణాన్ని కాపాడగలదని వారు కోరుతున్నారు.
👉 సహాయం కోసం వివరాలు:
ఖాతా పేరు: బుట్టి ప్రశాంత్
అకౌంట్ నెంబర్ : 62245459408
బ్యాంక్: స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా , సిరిసిల్ల బ్రాంచ్
IFSC Code: SBIN0020140
📱 గూగుల్ పే / ఫోన్ పే :
9182883636 – బుట్టి ప్రశాంత్
8712161619 – బుట్టి వంశీ
🙏 “నిరుపేద చిన్నారి గుండెను ఆదుకోండి..!!”






