బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం!
హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, అభిమానులకు, నాయకులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా… పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం అన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశమన్నారు. 25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వల లాంగ్ మార్చ్ అని సూచించారు. బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం అన్నారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో ఉదయం 11 గంటలకు కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. పార్టీ నాయకులతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. కేసీఆర్ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు.






