calender_icon.png 3 February, 2026 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 ఏళ్లలో రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్లు!

03-02-2026 12:20:19 AM

  1. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నిధులు

అయినా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఎల్‌ఈడీ ప్రచార రథాలు ప్రారంభం

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ౧౨ ఏళ్లలో రాష్ట్రా నికి రూ.12 లక్షల కోట్లు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు తెలిపారు. బీజేపీపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో మున్సిపల్ ఎన్నికల ఎల్‌ఈడీ ప్రచార రథాలను సోమవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపడుతోం దని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధు లు ఇచ్చిందో వీడియోల రూపంలో ప్రజలకు వివరిస్తామని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు ప్రచార రథాలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, అలాగే స్థానిక సంస్థల స్థాయిలో బీజేపీ దృష్టికోణం, విజన్‌ను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో ఈ ఎల్‌ఈడీ ప్రచార రథాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ ప్రధాన ఎజెం డాగా ముందుకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ఆశిష్ షెల్లార్, కో-ఇన్‌ఛార్జ్ అశోక్ పర్ణామి, రాజ్యసభ సభ్యురాలు, కోఇన్‌ఛార్జ్ రేఖా శర్మ, మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తదితరులు  పాల్గొన్నారు.

రెబల్‌గా పోటీ చేస్తే సస్పెండ్ చేస్తాం

బీఫామ్ ఇచ్చిన అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సహకరించాలని సూచించారు. పార్టీ తరపున నామినేషన్లు వేసిన ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని రాంచంద ర్‌రావు కోరారు. పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా రెబల్‌గా పోటీ చేయాలనుకుంటే వా ళ్లను 15 ఏండ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరిస్తూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.