calender_icon.png 3 February, 2026 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీరా రైస్‌లో గుట్కా ప్యాకెట్

03-02-2026 12:19:53 AM

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఘటన

ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నాయకులు                       

సూర్యాపేట (నల్లగొండ), ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులకు పెట్టే జీరా రైస్‌లో గుట్కా ప్యాకెట్ రావడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురై బాధ్యులను కఠినంగా శిక్షించాలని యూనివర్సిటీ గేటు ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. ఉదయం విద్యార్థులకు పెట్టిన జీరా రైస్‌లో గుట్కా ప్యాకెట్ రావడం, గతంలో కూడా అన్నంలో క్రిమికీటకాలు బయటపడినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం, ము ఖ్యంగా వైస్ ఛాన్స్‌లర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆరో పించారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నా యకులు గిన్నెలతో యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ ఎంజీయూ అధ్యక్షులు హనుమాన్ చారి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి హాని జరిగే సంఘటనలు పునరావృతమవుతున్న వైస్ ఛాన్స్ లర్ స్పందిం చకపోవడం దారుణమన్నారు. వెంటనే బా ధ్యులపై చర్యలు తీసుకొని, నాణ్యమైన ఆహా రం అందించే వరకు మా ఆందోళన ఆగదు‘ అని హెచ్చరించారు. సుమారు మూడు గం టల పాటు జరిగిన ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని వైస్ ఛాన్స్‌లర్‌ను పిలిపించగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వ డంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.