calender_icon.png 4 December, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 11 నామినేషన్లు దాఖలు

04-12-2025 12:45:29 AM

చారకొండ డిసెంబర్ 3: మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం మొదటి రోజున చారకొండ మండలంలోని 17 గ్రామ పంచాయతీ సర్పంచి స్థానాలకు గాను 11 నామినేషన్లు, 142 వార్డు స్థానాలకు గాను 21 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎంపీడీఓ శంకర్ నాయక్ తెలిపారు. చారకొండ సర్పంచి స్థానానికి 3, జూపల్లిలో 4, మర్రిపల్లి తండా, గోకారం, చంద్రయాన్ పల్లి, సారంబండ తండాలో ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలు అయ్యాయని తెలిపారు.