04-12-2025 12:43:45 AM
ట్రాఫిక్ ఎస్సై కృష్ణ చైతన్య
నారాయణపేట, డిసెంబర్ 3 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలో మైనర్లు వాహనాలు నడుపుతున్న వాహనాలను పట్టుకుని మైనార్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణ చైతన్య. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్త్స్ర మాట్లాడుతూ... మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉంటుందని, చట్టపరంగా ఇది తీవ్రమైన నేరమని తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ఓల్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా, వాహనాలు నడుపుతున్న అనేకమంది మైనర్లను గుర్తించి, వారికి కేసులు నమోదు చేశారు. అలాగే తల్లిదండ్రులపై కూడా మోటార్ వాహన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాలన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించడం, రూల్స్ పాటించడం తప్పనిసరి అని తెలిపారు. మైనర్ల వాహన నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి రాజీ లేకుండా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ప్రమా దం జరిగినప్పుడు ఇన్షూరెన్స్ వర్తించకపోవడం, చట్టపరమైన కేసులు ఎదురయ్యే అవ కాశం ఎక్కువని ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదం డ్రులకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి, రోడ్డు భద్రతా నిబంధనలు, వాహన నడపడంకు సంబంధించిన చట్టాలు, వాటివల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు మైనర్ల డ్రైవి్ంప జీరో టాలరెన్స్తో చర్యలు కొనసాగుతాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తాం అని ప్రజలు చట్టాలు, భద్రతా నియ మాలు తప్పనిసరిగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, వాహనదారులు, మైనర్లు పాల్గొన్నారు.