calender_icon.png 4 December, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యం బాగుంటేనే మంచి భవిష్యత్తు

04-12-2025 12:46:44 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 3:  నవజాత శిశువుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సాధించడంతో మంచి భవిష్యత్తు లభిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన  నవజాత శిశువుల తల్లులకు యెన్నం అన్న హెల్త్ కిట్ లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన ప్రతి తల్లికి ఈ  యెన్నం అన్న హెల్త్ కిట్ పంపిణీ చేయడం జరుగుతుందని, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుందని  చెప్పారు.  నవజాత శిశువుల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ హెల్త్ కిట్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నవజాత శిశువు ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యానికి పునాది అని,  శిశువు పొందే ప్రాథమిక సంరక్షణ, పోషకాహారం, శుభ్రత వంటి అంశాల్లో అలస్యముండకూడదని.

అందుకే ఈ హెల్త్ కిట్ను ప్రసవానంతరం వెంటనే అందించడం ద్వారా ఉపయోగకరమైన సహాయం అందించాలనుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సేవల మెరుగుదలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోజువారీగా పెరుగుతున్న ప్రసవాల సంఖ్య దృష్ట్యా సిబ్బంది,  వైద్య వనరులను మరింతగా బలోపేతం చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీర, ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంద్ర, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.