calender_icon.png 11 September, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు గచ్చిబౌలిలో 10కే, 5కే రన్

09-09-2025 01:04:54 AM

శ్రీ టీఎంటీ హైదరాబాద్ రన్ మైండ్ ఓవర్ మైల్స్ పేరుతో నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఆరెంజ్ హబ్ ఈవెం ట్స్ ఆధ్వర్యంలో, శ్రీ టీఎంటీ టైటిల్ స్పాన్సర్‌గా మైండ్ ఓవర్ మైల్స్ హైదరాబాద్ రన్ 10కే, 5కే రన్ ఈ నెల 9న ఉదయం 6 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. ఈ రన్ ప్రధాన ఉద్దేశ్యం మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం.

ప్రతి అడుగు కేవ లం ఒక రన్ కోసం కాదు  సమాజంలో మా నసిక ఆరోగ్యం గురించి మాట్లాడే ధైర్యం కో సం, అవగాహన కోసం, పేద పిల్లల ఆరో గ్యం కోసమని, టైటిల్ స్పాన్సర్ శ్రీ టీఎంటీ డైరెక్టర్ నీరజ్ గోయెంకా తెలిపారు. శ్రీ కరణ్ గోయెంకా, సీఈవో, శ్రీ టీఎంటీ మాట్లాడు తూ.. మైండ్ ఓవర్ మైల్స్‌కు మద్దతు ఇవ్వ డం ద్వారా మేము ప్రజల ఆరోగ్యంపై భాధ్యతను, విశ్వాసాన్ని మరోసారి బలప రుస్తున్నాం అన్నారు.

శ్రీ సిద్ధార్థ్ గోయెంకా, డైరెక్టర్, టీఎంటీ మాట్లాడుతూ.. “మిలియన్ల మంది విశ్వసించిన బ్రాండ్గా, శ్రీ టీఎంటీకి వ్యాపారం కంటే ఎక్కువ బాధ్యత ఉంది. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం మా ధర్మం” అన్నారు.

కార్రయక్రమంలో నిర్వాహకులు అజయ్‌రెడ్డి, సహ వ్యవస్థా పకుడు, ఆరెంజ్ హబ్ ఈవెంట్స్, డాలీ, ట్రస్టీ, టబితా, వ్యవస్థాపకురాలు, ఆరెంజ్ హబ్ ఈవెంట్స్, విద్యాభూషణ్, చైర్మన్, లిటిల్ వన్స్ క్యూర్ ఫౌండేషన్ (బాలరోగ్య సంవర్ధన్ యూనిట్), తదితరులు మాట్లాడుతూ.. రన్‌ను విజయవంత చేయాలని కోరారు.