09-09-2025 01:03:28 AM
బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ ఘనత
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలో అత్యాధునిక గుండె చికిత్సలో అగ్రగా మిగా పేరొందిన కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్ మరో మైలురాయిని చేరుకుంది. 76 ఏళ్ల రోగి రంగారావు (పేరు మార్చబడింది)పై స్వదేశీ మైక్లిప్ (మెరిల్) పరికరంతో ట్రాన్స్కాథెటర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ (టీఈఆర్) విధానాన్ని విజయవంతం గా పూర్తి చేసింది.
ఇది కేర్ హాస్పిటల్స్ గ్రూప్ లో తొలి కేసు. అలాగే హైదరాబాద్‌లో కూ డా అరుదైన విజయవంతమైన టీఈఆర్ కేసులలో ఇది ఒకటి. రంగారావు డయాబెటిస్, బీపీ, ఊపిరితిత్తుల వ్యాధి (సిఓపిడి), మూత్రపిండాల సమస్య, ప్రోస్టేట్ పెద్దవడం, గుండె రిదమ్ లోపం (ఎట్రియల్ ఫైబ్రిలేషన్)తో ఇబ్బందులు పడుతున్నారు.
బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్స్లో క్లినికల్ డైరెక్టర్, కార్డియాలజీ హెడ్ డాక్టర్ వి. సూర్య ప్రకాశరావు నేతృత్వంలో వైద్య బృందం, స్వదేశీ మై క్లిప్ (మెరిల్) సాంకేతికతతో శస్త్రచికిత్స అవసరం లేకుండా ట్రాన్స్కాథెటర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రి పేర్ (టీఈఆర్) వి ధానం విజయవంతంగా నిర్వహించింది. ఎకోకార్డియో గ్రాఫీ మార్గదర్శకత్వంలో మిట్రల్ వాల్వ్ను స్థిరంగా ఉంచేందుకు రెండు క్లిప్లను సక్రమం గా అమర్చారు.
దీంతో మిట్రల్ రెగర్జిటేషన్ సమస్య గణనీయంగా తగ్గింది. ఈ ప్రక్రియ తర్వాతే, రంగారావు మరుసటి రోజే చికిత్స పొందారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం లో, లక్షణాల్లో స్పష్టమైన మెరుగుదల కనిపించడంతో పాటు జీవన నాణ్యత కూడా గణనీయంగా పెరిగిందని డాక్టర్ వి.సూర్య ప్రకాశరావు అన్నారు.
కేర్ హాస్పిటల్స్ జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు నాయర్ మాట్లాడుతూ, “ఇంత క్లిష్టమైన పరిస్థితిలో స్వదేశీ మైక్లిప్ పరికరా న్ని విజయవంతంగా వినియోగించడం మా కోసం గర్వకారణం” అన్నారు.