calender_icon.png 11 September, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు కూచిపూడి నృత్యంలో రాణించడం అభినందనీయం

09-09-2025 01:04:54 AM

బీఆర్‌ఎస్ రాష్ర్ట సీనియర్ నాయకుడు నగేష్ ముదిరాజ్..

ముషీరాబాద్, సెప్టెంబర్ 8(విజయక్రాంతి):  అంతర్జాతీయ కూచిపూడి నృత్య కళాకారుల పోటీలు త్యాగరాయ గానసభ ప్రాంగణంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సాంసృతిక కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా బిఆర్‌ఎస్ రాష్ర్ట సీనియర్ నాయకులు నాగేష్ ముదిరాజ్,  రిటైర్డ్ జడ్జి మధుసూదన్, డిఫెన్స్ ఆఫీసర్ కెన్. రావులు పాల్గొని పోటీలలో రాణించిన కూచిపూడి నృత్య కళాకారుల  విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా నాగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో దేశ  విదేశల నుండి వందలాది మంది ప్రముఖ కూచిపూడి కళాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించి అవార్డులు గెలుచుకోవడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. విద్యార్థులు విద్యతో పాటు  కూచిపూడి నృత్యంలో రాణించడం అభినందనీయమన్నారు.

బంగారు తెలంగాణ ఆర్గనైజర్ వికీ మాస్టర్ కు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమం మరింత విజయవంతం కావాలని, కళాకారులు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కళాకారులు అందరూ విజేతలే అని కళాకారుల ప్రతిభను కొనియాడారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.