సార్ మాటలు నమ్మలేం!

01-05-2024 12:05:00 AM

తెలంగాణలో ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు విలువుండేది. కానీ, ఆయన ఓడిపోయిన తర్వాత ప్రజా విశ్వసనీయతను కోల్పోయారు. మూడోసారి కూడా గెలుస్తామనే అన్నారు కానీ, ఘోరంగా ఓటమి చవిచూశారు. ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు తాము చక్రం తిప్పుతామని, ఈ ఎన్నికల్లో కనీసం 12 ఎంపీ సీట్లు గెలుస్తామనీ నమ్మకంగా అంటున్నారు. ఇంకా, ‘బీజేపీకి 200 సీట్లు కూడా రావంటు’న్నారు. రేవంత్‌రెడ్డి ‘దద్దమ్మ’ అంటున్నారు. ఒక మాజీ సీఎంగా ఆయన ‘హుందాగా’ వుండలేరా? ఎన్నికల కోసం ఏది పడితే అది మాట్లాడితే ఎలా!

డి.శ్రీనివాస్, రామాయంపేట, మెదక్‌జిల్లా