త్రిముఖ పోరులో ఎవరిది పైచేయి?

30-04-2024 12:15:00 AM

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగిసిన నేపథ్యంలో ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఇప్పుడు ప్రచార యుద్ధంలోకి దిగాయి.  ఈ నెల ప్రారంభంలో లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన సమయానికీ, ఇప్పటికీ ఎన్నికల వాతావరణం పూర్తిగా మారిపో యింది. మొదట్లో పోటీ ప్రధానంగా  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రం లో అధికార పార్టీ అయిన బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని అందరూ భావించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం నుంచి కారు పార్టీ పూర్తిగా కోలుకోకపోవడం, ఆ పార్టీ నుంచి పలువురు నేతలు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీల లోకి వలసలు సాగించిన నేపథ్యంలో ఒక దశలో బీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజక వర్గాలకు బలమైన అభ్యర్థులు దొరకడం కూడా గగనంగా కనిపించింది. 

రైతుల సమస్యలపైనే ప్రచారాస్త్రాలు

అయితే ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బైటికి వచ్చి నేరుగా ప్రచార రంగంలోకి దుమకడంతోపాటుగా పార్టీ కేడర్‌లో ఆత్మ స్థుర్యై న్ని కలిగించారు. ఇప్పుడు ఆ పార్టీకూడా ఎన్నికల బరిలో దూసుకు పోతోం ది. కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గా ల్లో బస్సుయాత్ర పేరుతో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ సర్కార్‌తోపాటుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటుగా ఇతర నేతలు కూడా ఉధృతంగానే ప్రచారం సాగిస్తున్నారు. కేసీఆర్ ప్రచారం అంతాకూడా రైతుబంధు ఇవ్వకపోవడంతోసహా రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీల అమలులో వైఫల్యం, విద్యుత్ కోతలు, వర్షాభావ పరిస్థితులు లాంటి రైతులకు సంబంధించిన అంశాలపైనే సాగుతోంది. దీనికి తోడుగా మోడీ ముస్లింలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్య లు, అమిత్ షా చేసినట్లుగా చెప్తున్న బీసీ రిజర్వేషన్ల రద్దు లాంటి అంశాలు, గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైఫల్యాలపై ఆయన ఘాటుగానే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 

క్యూ కడుతున్న అగ్రనేతలు

ఇక, 400కు పైగా సీట్లు గెలుచుకుని కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కాషాయ పార్టీ దక్షిణాదిపై ప్రధానంగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. గతంలో తాము అధికారంలో ఉండిన కర్నాటకతోపాటుగా మొదటినుంచి కూడా బలమైన ఓటు బ్యాంకు ఉన్న తెలంగాణపై ఆ పార్టీ ఈసారి ప్రత్యేక దృష్టిపెట్టింది. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా మెజారిటీ స్థానాల ను దక్కించుకోవాలని భావిస్తున్న ఆ పార్టీ  వాస్తవానికి అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టింది.  ఇప్పు డు పోలింగ్‌కు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండడంతోపాటు  దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగియడంతో పార్టీ అగ్రనేతలంతా ప్రచారం కోసం రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. మంగళవారం రాష్ట్రానికి ప్రధాని మోడీ రానుండగా, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ధ్యక్షుడు జేపీ నడ్డా కూడా  విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు.  ఇక, కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటుగా ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్,  ధర్మపురి అర్వింద్ లాంటి నేతలు కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. పనిలో పనిగా అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఇటు గత బీఆర్‌ఎస్‌ఎస్ సర్కార్‌పైనా తీవ్రస్థాయిలో విమర్శ లు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ముం దు వరకు రాష్ట్ర గవర్నర్‌గా ఉండిన తమిళిసైకూడా బీజేపీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అన్నీ తానై..

మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడి ్డఎన్నికల కురుక్షేత్రంలో అర్జునుడులాగా అటు బీఆర్‌ఎస్ నుంచి, ఇటు బీజేపీ నేతల నుంచి వచ్చే విమర్శలను ధీటుగా తిప్పికొట్టడమే కాకుండా ఎదురుదాడి కూడా చేస్తూ ప్రచారంలో దూసుకు పోతున్నారు. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రోజూ ఒకటి రెండు జిల్లాల్లో బహిరంగ సభలు, రోడ్డు షోలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు.  సోనియా,  రాహుల్, ప్రియాంక, ఖర్గేలాంటి కాంగ్రెస్ అగ్రనేతలు కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు వున్న సానుకూల అంశాలను సద్వినియోగం చేసుకుంటూ రేవంత్ ఎన్నికల ప్రచార వ్యూహాల్ని విజయవంతంగానే అమలు చేస్తున్నారు. పనిలో పనిగా బీఆర్‌ఎస్ నుంచి వచ్చే నేతలకు పార్టీ కండువాలు కప్పుతూ స్థానికంగా పార్టీ బలాన్ని పెంచుకుంటున్నారు. బీజేపీకి రాష్ట్రంలో ఉన్నది వాపు తప్ప బలం కాదని, అది గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయిందని, ఇక బీఆర్‌ఎస్ మునిగి పోతున్న టైటానిక్ ఓడ లాంటిదని, లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితమవుతారం టూ రెండు పార్టీలపైనా ఎదురు దాడి చేస్తున్నారు. ఈ రెండు పార్టీలకు కూడా రాబోయే ఎన్నికల్లో దక్కేది ఒకటి రెండు సీట్లేనని, కాంగ్రెస్‌కు 14 సీట్లు ఖాయమని ఢంకా బజాయించి చెబుతున్నారు. వీటన్నిటికి తోడు సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో కనిపించే గ్రూపు తగాదాలు ఈసారి ఎన్నికల్లో కనిపించకపోవడం విశేషం. మంత్రు లతోపాటుగా పార్టీ నేతలంతా కూడా రేవంత్ సారథ్యంలో ఒక్కతాటిపై నిలిచి ప్రచారంలో మరింత జోష్ నింపుతున్నారు. అయితే, బీఆర్‌ఎస్, బీజేపీలు కూడా పదికి పైగానే స్థానాలు గెలుచుకుంటామని చెబుతుండడం గమనార్హం. 

మూడు ప్రధాన పార్టీలు కూడా గెలుపు తమదేనన్న ధీమాతో ప్రచారం సాగిస్తున్నా ఓటరు మహాశయుడు మాత్రం ఎక్కడా పార్టీల అంచనాలకు అందడం లేదు. అన్ని పార్టీల సభలకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతున్నా వారంతా ఆ పార్టీ అభిమానులని కానీ, ఫలానా పార్టీకే ఓటు వేస్తారని కానీ చెప్పడానికి వీల్లేకుండా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనే వాస్తవానికి కొంతమేరకు ఎవరు ఏ పార్టీ వాళ్లో తెలుసుకునే అవకాశం ఉంది కానీ, హైదరాబాద్ మహానగరంలో మాత్రం ఏ మాత్రం అవకాశం లేకుండా వుంది. ఎందుకంటే, పొరుగున ఉన్న ఆంధ్రలో లోక్‌సభ ఎన్నికలతోపాటుగా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతుండడం, అక్కడ  ముఖ్యమంత్రి జగన్ పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమికి మధ్య హోరాహోరీగా పోటీ ఉండడంతో జంటనగరాలతోపాటుగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్థిరపడిన ఆంధ్ర ఓటర్లు అక్కడ ఓటేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు.

అందు వల్ల ఇక్కడి ఎన్నికలపై వారు అంతగా ఆసక్తి కనబరచడం లేదనే మాట వినిపిస్తోంది. పోలింగ్ సమయానికి తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతాలకు లక్షల సంఖ్య లో తరలి వెళతారని అంచనా. ఇదే నిజమయితే జంటనగరాలు, చేవెళ్ల మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానాలపై దీని ప్రభావం భారీగా ఉండవచ్చు. అంతేకాకుండా, సాధారణంగా నగర ఓటర్లు ఓటు వేయడానికి అంత పెద్దగా ఆసక్తి చూపించరు. ఈ పరిస్థితుల్లో ప్రధాన పార్టీలు ఆంధ్ర ఓటర్ల వలసలకు ఎంతమేరకు అడ్డుకట్ట వేయగలవనే దానిపైనే అభ్యర్థుల విజయావకాశాలు ఉంటాయి. రాబోయే రెండు వారాల్లో మూడు ప్రధాన పార్టీలు ఎలా ప్రచారం సాగించనున్నాయి, ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్ మేనేజిమెంట్‌పైనే అభ్యర్థుల విజయావకాశాలు అధార పడి ఉంటాయి.  

మూడు ప్రధాన పార్టీలు కూడా గెలుపు తమదేనన్న ధీమాతో ప్రచారం సాగిస్తున్నా ఓటరు మహాశయుడు మాత్రం ఎక్కడా పార్టీల అంచనాలకు అందడం లేదు. అన్ని పార్టీల  సభలకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతున్నా వారంతా ఆ పార్టీ అభిమానులని కానీ, ఫలానా పార్టీకే ఓటు వేస్తారని కానీ చెప్పడానికి వీల్లేకుండా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనే వాస్తవానికి కొంతమేరకు ఎవరు ఏ పార్టీ వాళ్లో తెలుసుకునే అవకాశం ఉంది కానీ, హైదరాబాద్ మహానగరంలో మాత్రం ఏ మాత్రం అవకాశం లేకుండా వుంది. 


కె. రామకృష్ణ