బ్యాంకుల అక్రమాలపై చర్యలేవి?

01-05-2024 12:05:00 AM

వినియోగదారులపట్ల అనైతిక చర్యలకు పాల్పడ్డ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ (ఆర్థిక  సంస్థలు)లపై ఆర్బీఐ చర్యలు తీసుకోకుండా వట్టి ఆదేశాలు జారీ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఖాతాదారులు, రుణగ్రహీతల నుంచి నియమాలకు విరుద్ధంగా అధిక వడ్డీలు వసూలు చేయడాన్ని ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ తప్పు పట్టినట్టు వార్తలు వచ్చాయి. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన బ్యాంకుల పేర్లను కూడా వెల్లడించి వుంటే బావుండేది. వినియోగదారులు ఇకనైనా అప్రమత్తంగా వుండాలి.      

               ఈశాన్ శ్రీవాత్సవ, కొండాపూర్, హైదరాబాద్