ఈడీ పిటిషన్ పై తీర్పు నేడే
25-06-2024 11:08 AM
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ను వ్యతిరేకిస్తూ ఈడీ వేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. ఈ పిటిషన్ పై మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువడే అవకాశం ఉంది.
ఈ బెయిల్ ఉత్తర్వు అమలును జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ నేతృత్వంలోని ధర్మాసనం జూన్ 21న స్టే విధించారు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ స్టేను సవాల్ చేస్తూ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. ఈ పిటిషన్ ను జూన్ 26వ తేదిన విచారిస్తామని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ తో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం స్పష్టం చేసింది.






