28 July, 2026 | 11:30 AM

ఎమర్జెన్సీని ఎందురించిన వారందరికీ నివాళులర్పించే రోజు : ప్రధాని మోదీ

25-06-2024 11:43 AM

న్యూఢిల్లీ : దేశంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ రోజులు చీకటి రోజులని, కాంగ్రెస్ ను వ్యతిరేకించిన వారిని హింసించేవారని.. వేధించేవారని ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్ వేదికగా 'డార్క డేస్ ఆఫ్ ఎమర్జెన్సీ' అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీని ఎదురించిన మహనీయులు, మహిళలందరికీ ఈ రోజు నివాళులు అర్పించే రోజు అని పేర్కొన్నారు.

దేశంలోని ప్రజల ప్రాథమిక స్వచ్ఛను, అలాగే ప్రతి భారతీయుడు ఎంతో గౌరవించే భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఇందిరా గాంధీ హయంలో 25 జూన్ 1975 నుంచి 21 మార్చి 1977 మధ్యకాలంలో 21 నెలల పాటు దేశంలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని ప్రధాని చెప్పారు. ఎమర్జెన్సీ విధించిన పార్టీయే లెక్కలేనన్ని సందర్భాంలో ఆర్టికల్ 356ను విధించిందన్నారు. దీంతో పత్రికా స్వేచ్ఛను నాశనం చేయడానికి బిల్లును తీసుకున్నారని, ఫెడరలిజాన్ని నాశనం చేశారని విమర్శించారు.