రెండో రోజు లోక్ సభ సమావేశం.. మధ్యాహ్నం తెలంగాణ ఎంపీలు ప్రమాణం
న్యూఢిల్లీ: 18వ లోక్ సభ తొలి సమావేవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు జూలై 3 వరకు జరుగనుండగా.. రెండోరోజు లోక్ సభ సభ్యుల ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగుతుంది. సమావేశాల తొలిరోజే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రలు సహా పలు రాష్ట్రాల 262 మంది ఎంపీలుగా ప్రమాణం చేశారు.
ప్రొటెం స్పీకర్ భర్తృహరి నిన్న ఎంపీలతో ప్రమాణం చేయించగా.. ఇవాళ మిగిలిన వారితో ప్రమాణం చేయించనున్నారు. తెలంగాణ ఎంపీలు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరు కానున్నారు. అలాగే మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్ సహా 270 మంది ఎంలు లోక్ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.






