మాకు న్యాయం చేయాలి!
‘తెలంగాణ అనే పదం మా గుండె ల్లో నాటుకుపోయింది. ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వారిగా మిగిలిపోయిన పర్వాలేదు ఉద్యమమే ఊపిరిగా భావించాం. ఈ పోరాటంలో మమ్మల్ని హేళన చేసిన వ్యక్తులే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మాపై ఆధిపత్యం చలాయించి మమ్మ ల్ని చులకనగా చూశారు’ అని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన మలిదశ ఉద్యమకారుడు గుండా మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపు మేరకు తెలంగాణ నినాదం ప్రతిఒక్కరిలో ధ్వనించేలా కృషి చేశా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడమే ధ్యేయంగా పోరాటం చేశా. ఎందుకంటే ప్రతి రంగంలో ఆంధ్ర పెత్తనం ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో సినీ హీరోల అభిమాన సంఘాల నుంచి ప్రతి వ్యాపారం, ప్రతి పనిలోనూ ఆంధ్రా పెత్తనం ఎక్కువగా ఉండేది. ఆంధ్రా, తెలంగాణకు ఉన్న తేడా దగ్గరగా చూశా.
పదవులు వారికే..
కేవలం ఉద్యమానికి మాత్రమే ఉద్యమకారులు పనికి వస్తారు. రాజకీయంగా పనికిరారు అనేలా కేసీఆర్ వ్యవహరించిన తీరు మా గుండెల్లో నాటుకుపోయింది. అప్పుడు కాంగ్రెస్, టీడీపీవాళ్లు హేళన చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత వారిని ఆహ్వానించి పదవులు కట్టబెట్టిండు. అప్పుడు కూడా వారి ముందు అవమానంగా అనిపించింది. ఉద్యమాకారులే బీఆర్‌ఎస్ పార్టీని ఇంటికి పంపించడంలో కీలకంగా పనిచేశారు.
న్యాయం చేయాలి..
ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిచండంతోపాటు 250 గజాల స్థలం అంది స్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తూచ తప్పుకుండ ఇవ్వాలి. ఇప్పటివరకు ఆ ప్రకటనపై మాట్లాడడం లేదు. ఉద్య మకారులకు అందించాల్సిన గుర్తింపు ఇవ్వాలి. గత ప్రభుత్వంలా కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యమకారులు అండగా నిలబడతారు.
మహబూబ్‌నగర్, (విజయక్రాంతి)






