3 August, 2026 | 2:22 PM

మంత్రి తుమ్మలకు రైతుల ఆహ్వానం

03-08-2026 01:51 PM

దమ్మపేట, ఆగస్టు 03(విజయక్రాంతి): మండల పరిధి గండుగులపల్లిలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో సోమవారం వెంసూర్ మండల పామాయిల్ రైతులు, తుమ్మల అభిమానులు, సీనియర్ నాయకులు మంత్రి తుమ్మలను కలిశారు. రాష్ట్రములో ఎక్కడా లేనివిధంగా మా ప్రాంత  ప్రజలు అడిగిన వెంటనే వెంసూరు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ ఏర్పాటు చేశారని, కల్లూరు గూడెం పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి కావచ్చిందని, అలాగే మా పొలాలకు గోదావరి జలాలను అందించిన ఘనత మీదేనని ఈ సందర్భంగా ఆ ప్రాంత రైతులు తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. మేము మా ప్రాంత రైతులు పామాయిల్ పంటను వేయటం ద్వారా సంతోషంగా ఉన్నామని మా మండల రైతులు ఆత్మీయ సమావేశానికి మీరు తప్పక రావాలని వారు మంత్రి తుమ్మలను ఆహ్వానించారు.