ఖతార్‌లో కలుద్దాం

05-10-2026 | 05:25am
  1. ముగిసిన 2026 ఆసియా క్రీడలు
  2. అట్టహాసంగా ముగింపు వేడుకలు
  3. వన్ ఏషియా థీమ్‌తో నిర్వహణ
  4. 2030లో దోహా ఆతిథ్యం 

నగోయా, అక్టోబర్ 4 : క్రీడాభిమానులను అలరించిన ఆసియా క్రీడా సంబరం(Asian Games Extravaganza) ముగిసింది. జపాన్‌లోని ఐచి నగోయా వేదికగా జరిగిన ఈ ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19న మొదలవగా, 45 దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు. ఆదివారం నగోయాలోని పలోమా మిజుహు అథ్లెటిక్స్ స్టేడియం వేదికగా ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వన్ ఏషియా థీమ్‌తో నిర్వహించిన ఈ వేడుకల్లో జపాన్ సాంస్కృతిక సం ప్రదాయలతో కూడిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

జపాన్ ప్రముఖ గర్ల్ బ్యాండ్ ’మైరా’ తమ సంగీత ప్రదర్శనతో ఈకార్యక్రమాన్ని హోరెత్తించింది. టొకుగావా ఇయాసు, హట్టోరి హంజో నింజా కారప్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంప్రదాయ జపనీస్ నింజా విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ ముగింపు వేడుకల్లో భారత బృందానికి డబుల్ గోల్ మెడ లిస్ట్, స్టార్ షూటర్ నీరు దండా పతాకధారిగా వ్యవహరించింది. మహిళల వ్యక్తిగత ట్రాప్ విభాగంలో స్వర్ణం సాధించడంతో పా టు మిక్స్‌డ్ ట్రాప్ ఈవెంట్లోనూ మరో పసిడిని గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

ఈ ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 85 పతకాలతో (21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు) నాలుగో స్థానంలో నిలిచింది. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా జెండాను ఐచి-నగోయా నిర్వాహకుల నుంచి తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతార్ రాజధాని దోహా 2030 నిర్వాహకులకు అధికారికంగా అందజేశారు.

మరిన్ని వార్తలు