calender_icon.png 5 February, 2026 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ మీటింగ్

04-02-2026 09:00:13 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో, ఫీల్డ్ అసిస్టెంట్లతో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రానున్న వేసవికాలం సందర్భంగా మండలంలోని గ్రామాలలో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి గ్రామంలో 100% ఉపాధి పనులు చేపట్టాలి.

గ్రామంలో జాబు కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి పనులకు హాజరయ్యేలా చూడాలని, ఉపాధి హామీ పనులు సమయానుసారం పెట్టాలని, ఉదయాన్నే వెళ్లి ఎండ సమయం కాకముందే పనులు ముగించుకోవాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శులు ఐకమత్యంతో పనులు కొనసాగించి గ్రామాలను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సాయిలు,పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.