9 April, 2026 | 8:43 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

మేడారంలో తిరుగువారం పండగ

05-02-2026 12:36 AM

ముగిసిన మహా జాతర 

మేడారం, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): మేడారం మహా జాతర సందర్భంగా తిరుగువారం పండుగ బుధవారం అత్యంత ఘనంగా నిర్వహిం చారు. తిరుగువారం పండుగ నిర్వహణతో మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ముగిసినట్లుగా భావిస్తారు. ఈ సందర్భంగా వన దేవతల పూజారులు, కుటుంబ సభ్యులతో కలిసి మేడారం, కన్నేపల్లి గుడిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించి వన దేవతలకు యాట పోతులు, కోళ్లు సమర్పించి, దీప దూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం అమ్మవార్ల పూజ సామాగ్రి, పట్టు వస్త్రాలను భద్రపరిచారు. సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం తిరుగువారం పండగ సందర్భంగా వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహంతో కోలాహలంగా మారింది. గద్దెల ప్రాం గణం భక్తులతో కిక్కిరిసిపోయింది.