15 April, 2026 | 2:22 AM

పీఎం శ్రీ పాఠశాల విద్యార్థుల విజ్ఞాన యాత్ర

04-02-2026 09:04 PM

పెంచికల్పేట,(విజయక్రాంతి): మండలముల కేంద్రములోని  పీఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ పెంచికల్పేట్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు విజ్ఞాన యాత్రలో భాగంగా కరీంనగర్లోని కరీంనగర్ డైరీ పాల కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఇందులో పాలన ఏ విధంగా ప్యూరిఫికేషన్ చేయడం జరుగుతుంది. పాల నుండి ఉత్పత్తులను ఏ విధంగా తయారు చేయడము ఆ మిషన్ నీ పని చేసే విధానాన్ని గురించి విద్యార్థులకు ఆ సిబ్బంది వివరించడం జరిగింది.

కరీంనగర్లోని జింకల పార్క్ ను విద్యార్థులు సందర్శించి వివిధ రకాల జంతువులను  వీక్షించి  ఆ పార్కులో పరిసరాల పర్యావరణాన్ని, జంతు పరిరక్షణ ఏ విధంగా చేయాలి అని నేర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పెంచికల్పేట ప్రధానోపాధ్యాయురాలు విజయనిర్మల, ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులతో పాల్గొనడం జరిగింది.