24 March, 2026 | 12:15 AM

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

23-03-2026 10:07 PM

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

167 అర్జీల రాక

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సమస్యల పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నామని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి.. ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించి.. పరిష్కారానికి ఆదేశించారు. మొత్తం 167 అర్జీల రాగా, సంబంధిత అధికారులకు అందజేశారు. రెవెన్యూ శాఖకు 62, గృహ నిర్మాణ శాఖకు 28, డీఆర్డీఓకు 19, జిల్లా పంచాయతీ కార్యాలయం 9, ఉపాధి కల్పన అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఎస్పీ కార్యాలయానికి 5 చొప్పున, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కు 4, జిల్లా విద్యాధికారి, జిల్లా వైద్యాధికారి, జిల్లా సంక్షేమ శాఖ,

నీటి పారుదల శాఖ, సెస్ ఎండీకి 3 చొప్పున, జిల్లా పౌర సరఫరాల శాఖ, మైనింగ్ శాఖ అధికారి, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం, లీడ్ బ్యాంక్ మేనేజర్ కు 2 చొప్పున, మత్స్య శాఖ అధికారి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి, ఈడీఎం, ఈఈ ఆర్ అండ్ బీ, మిషన్ భగీరథ, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, సబ్ రిజిస్టర్ సిరిసిల్లకు ఒకటి చొప్పున వచ్చాయి. వాటిని సంబంధిత కార్యాలయాలకు పంపించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు తదితరులు పాల్గొన్నారు.