24 March, 2026 | 1:28 AM

నలభై ఏళ్ల బంధానికి తెగతెంపులు

24-03-2026 12:00 AM
  1. నేడు జీవన్ రాజీనామా

ఏప్రిల్ మొదటి వారంలో గులాబీ గూటికి

కరీంనగర్, మార్చి23(విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కు ఇన్ని రోజులు పెద్దదిక్కుగా ఉన్న జీవన్ రెడ్డి నేడు పార్టీ కి రాజీనామా చేయనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటినుండి ఆయన దిక్కార స్వరం వినిపిస్తూ వస్తున్నారు ఏ ఐ సి సి పెద్ద నుండి రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు అడ్లూరు లక్ష్మి కుమార్ వరకు చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు

జీవన్ రెడ్డి నాడు ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి సంచలన నాయకునిగా పేరు తెచ్చుకొని నేడు కాంగ్రెస్ పై తిరుగుబాటు చేస్తూ మరో సంచలనాన్ని సృష్టించి రాష్ట్ర రాజకీయాలను కుదిపేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు ఈనెల 25న పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఏప్రిల్ మొదటి వారంలో జగిత్యాల లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ లో చేరడానికి ఏర్పాటు చేస్తున్నారు.

జీవన్ రెడ్డి తాజా నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ కి నష్టమని రాజకీయ వర్గాలు బావి స్తున్నాయి జీవన్ రెడ్డి చేరిక అనంతరం బిఆర్‌ఎస్ ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పార్టీ పూర్వవైభం కోసం పావులు కద పనుంది. జీవన్ రెడ్డి వెంట ఎవరు నడిచి వస్తారు అన్నది వేచి చూడాల్సిందే సంచలనాల కేంద్ర బిందువైన జీవన్ రెడ్డి జగిత్యాల తిరిగి సత్తా చార్ట్ తార లేక చతికిల పడుతారా చూడాలి.

ఏది ఏమైనా జీవన్ నిర్ణయం ఒక సంచలనమే ఆరుసార్లు ఎమ్మెల్యే గా మూడు సార్లు మంత్రిగాసీనియర్ నాయకుడు టి. జీవన్ రెడ్డి 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం లో 40 ఏళ్ళు కాంగ్రెస్ తో ఉన్నారు. అనేక పదవులు అలంకరించారు. ఆయన 1983లో టీడీపీలో చేరి జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తొలిసారి శాసనసభలో అడుగుపెట్టి ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఎన్టీ రామారావు 1985లో ప్రభుత్వం రద్దు చేయడంతో తిరిగి జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి 1985లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గొడిశెల రాజేశం గౌడ్ చేతిలో ఓడిపోయాడు.

జీవన్ రెడ్డి 1989లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, 1994లో ఓడిపోయి 1996 ఉప ఎన్నికలో గెలిచి 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాడు. ఆయన 2004 మే 14 నుండి 2009 మార్చి 2 వరకు వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆయన 2006, 2009లో కరీంనగర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.

జీవన్ రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నాడు.

ఆయన 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి 2019లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. టీ జీవన్రెడ్డికి 56,698 ఓట్లు సాధించి భారీ మెజారిటీ స్వంతం చేసుకున్నారు. అయితే ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒడి పోయారు.