13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా చేపట్టారు

23-03-2026 10:11 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అనుమతులు లభించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వెంట వెంటనే పూర్తి చేస్తూ ఉండాలని పేర్కొన్నారు.

చివరిదశ పనులు మిగిలి ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేసి, గృహ ప్రవేశాలు చేపట్టాలని అన్నారు. వారం వారిగా ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఇప్పటివరకు గృహ ప్రవేశాలు పూర్తి చేసిన ఇండ్ల వివరాలు, ఆయా దశల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల వివరాలు అధికారుల ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, హౌసింగ్ పిడి రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.