calender_icon.png 11 January, 2026 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలగలంచలో అందాల వ్యూ పాయింట్

11-01-2026 12:19:57 AM

ప్రారంభించిన మంత్రి సీతక్క 

ములుగు, జనవరి 10 (విజయక్రాంతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలం పరిధిలోని జలగలంచ వాగు ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పచ్చని అడవి అందాల వ్యూ పాయింట్‌ను మంత్రి సీతక్క శినవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో బొగత జలపాతం ఎంతోమంది పర్యాటకులను ఆకర్షిస్తూ చాలా ప్రాంతాల ప్రజలు వస్తు వెళుతున్నారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఊటీ, కొడైకెనాల్ లాంటి పర్యాటక ప్రాంతాలకు దీటుగా ఇక్కడ అడవి అందాలు ఉంటాయని చెప్పారు.