11-01-2026 12:21:16 AM
సభ స్థలిని పరిశీలించిన వరంగల్ ఆర్యవైశ్య జేఏసీ సాధన కమిటీ కన్వీనర్ మహేష్‌బాబు
హనుమకొండ టౌన్, జనవరి 10 (విజయక్రాంతి): హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహిస్తున్న ఓసీల సింహగర్జన సభ ఏర్పాట్లను వరంగల్ ఆర్యవైశ్య జేఏసీ సాధన కమిటీ కన్వీనర్ గట్టు మహేష్ బాబు శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అగ్రకులాల్లో పేదలకు అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యానికి వ్యతిరేకంగా హక్కుల సాధనకై పిలుపునిచ్చిన ఓసిల సింహగర్జన సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, మార్వాడి, కమ్మ, వెలమ సోదరులకు భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను అలాగే వెహికల్ పార్కింగ్ అనువైన స్థలాన్ని ఏర్పాటు చేయడం వంటివి పరిశీలించారు.