11-01-2026 12:18:28 AM
60 తులాల బంగారం స్వాధీనం
నల్లగొండ క్రైం, జనవరి 10: బస్సులలో బంగారు ఆభరణాలను దొంగలించే అంతరాష్ట్ర థార్ గ్యాంగ్ ముఠా సభ్యుడిని అరెస్టు చేసి, 6o తులాల బంగారాన్ని నల్లగొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్ జిల్లా ధర్మపురి తాలూ కా ఖల్ఘాట్ గ్రామానికి చెందిన షా అల్లా రఖా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలని దోపిడీలకు పాల్పడుతున్నాడు.
డిసెంబర్ 5న చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సులో భారీ మొత్తం లో బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చోరీకి పాల్పడిన ది థార్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. ప్రత్యేక బృందాలు 15 రోజుల పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాం తాలలో గాలిం చి, మనవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమర్భాన్ క్రాస్ రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అత డు తన సహచరులు అష్రఫ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, జాబర్ ఖాన్, ఉమర్ ఖాన్లతో కలిసి చోరీ చేసినట్టుగా అంగీకరించాడు. గతంలో ఈ ముఠా 2022, 2023 సంవత్సరంలో విజయవాడ హైవేపై హోటళ్ల వద్ద ఆగి ఉన్న బస్సు నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను దొంగలించా రు. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.